షారూఖ్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు

sharuk-khan-in-usa

అగ్రరాజ్యం అమెరికాలో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు అవమానాలు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ దేశానికి వెళ్లిన షారూక్ ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీల పేరిట అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం అమెరికాలో ల్యాండైన షారూక్ ను అక్కడి భద్రతాధికారులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు సుహానా, ఆర్యన్ లతో కలిసి అమెరికాలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని షారూక్ ఖానే స్వయంగా వెల్లడించాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రస్తావించిన అతడు… ప్రతిసారీ తనకు అమెరికాలో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

(53)

Leave a Reply