అలియా భట్ ప్రొడ్యూసర్ గా :

alia-bhatt-as-producer

ప్రొఫెషన్ ఏదైతే అదే ప్రొఫెషన్ లో కొనసాగడం వారసులు కూడా ఫాలో అవుతారు. అయితే అవి ఇదివరకటి రోజులు అనుకుంట ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మార్చేసారు . హీరో హీరోయిన్ లు ఆ ప్రొఫెషన్ లోనే ఉంటూ సైడ్ ప్రొఫెషన్ లని కూడా చూసుకుందాం అని ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ భట్ లాంటి డైరెక్టర్ కి కూతురైన అలియా భట్ పెద్ద హీరోయిన్ గా ఎదుగుతోంది. ఆమె తండ్రి అడుగుజాడల్లో డైరెక్టర్ అవుతుంది అనుకున్నారు ఎందుకంటే ఆమె అక్క పూజా భట్ కూడా డైరెక్టర్ అయిపొయింది. మొదటి హీరోయిన్ గా చేసిన పూజ తర్వాత తండ్రి లాగా డైరెక్షన్ వైపు అడుగులు వేసింది. ఒక హాట్ హాట్ వెబ్ సీరిస్ ని ప్రస్తుతం నడిపిస్తోంది ఆమె. కానీ అలియా భట్ మాత్రం డైరెక్టర్ గా మారను గాక మారను అంటోంది. కానీ ప్రొడక్షన్ మీద ఆసక్తి ఉంది అని సినిమాలు నిర్మిస్తాను అని ప్రకటించింది ఆమె. ” ఎదో ఒక రోజు నిర్మాతగా వస్తాను, డైరెక్షన్ అనేది చిన్న విషయం కాదు .. అనుకున్నది తెరమీద చూపించడం కోసం చాలా లెక్కలు వేసుకోవాలి , ఎక్కడెక్కడో రీసర్చ్ చెయ్యాలి నాకు అంత సహనం ఉంది అని నేను అనుకోవట్లేదు ” అంటూ చెబుతోంది అలియా భట్.

(49)

Leave a Reply