హీరోయిన్ కి విషెస్ చెబుతున్న మెగా హీరో

mega-hero-wishes-a-heroine

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్ తన తొలి హీరోయిన్ కు శుభాకాంక్షలు చెప్పాడు. వరుణ్ తేజ్ తో పాటు పూజా హెగ్డే కూడా సినీ రంగ ప్రవేశం ఈ సినిమా ద్వారానే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెనుకంజ వేసినప్పటికీ మ్యూజికల్ గా మంచి పేరుతెచ్చుకుంది. వీరిద్దరికి కూడా మంచి పేరు తెచ్చింది.అనంతరం ‘ఒకలైలా కోసం’ సినిమాలో నటించిన పూజా హెగ్డేకు బాలీవుడ్ లో ‘మొహొంజదారో’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పెద్ద అవకాశం రావడంతో ఇతర సినిమాలన్నీ వదులుకుని ఈ సినిమాకు సంతకం చేసింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుణ్ తేజ్ తన తొలి హీరోయిన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

(87)

Leave a Reply