వివాదాస్పద కథ తో రాజమౌళి తండ్రి

rajmoulis-father-in-controversial

బాహుబలి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్ అదే సంవత్సరం భజరంగి భాయ్ జాన్ సినిమాకు కథ అందించి ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించాడు. అయితే ఆ రెండు సినిమాల హిట్ తో బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లే విజయేంద్ర ప్రసాద్ కు వచ్చాయి కాని వాటినేవి ఒప్పుకోని ఈయన ఇప్పుడు మరో ప్రస్టిజియస్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. బాబ్రి మసీదు కూల్చివేత కథాంశంతో పాటుగా 1990లో జరిగిన ముంబై గొడవల నేపథ్యంతో ఓ కథ సిద్ధం చేసి అజయ్ దేవగన్ కు వినిపించాడట. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. భజరంగి భాయ్ జాన్ కథతో బీ టౌన్ వారికి షాక్ ఇచ్చిన మన రైటర్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. భాయ్ జాన్ తో పాకిస్థాన్ లో కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన ఈయన ఇక రాబోతున్న సినిమాలో ఇంకా వివాదాస్పదమైన కథను ఎన్నుకోవడం అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఓ పక్క బాహుబలి కంక్లూజన్ కార్యక్రమాలు చూస్తున్న విజయేంద్ర ప్రసాద్ అజయ్ దేవగన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడట. ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(74)

Leave a Reply